AP Police Constable Answer Key 2023 కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష కీ విడుదల

fastsr
1 Min Read

 

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత
పరీక్షకు 91 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

అలాగే కీని సైతం రిలీజ్‌ చేసేసింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్‌
చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆదివారం
ప్రిలిమినరీ ఎగ్జామ్‌ ప్రశాంతంగా ముగిసింది. 

పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా
చెప్పిన టైంకి slprb.ap.gov.in వెబ్‌సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ
అప్ లోడ్ చేశారు అధికారులు. జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిలిమినరీ
ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలను తెలిపేందుకు
id mail-slprb@ap.gov.in మెయిల్ ఐడీ కేటాయించింది
రిక్రూట్‌మెంట్‌ బోర్డు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి కీ డౌన్లోడ్ చేసుకోండి..

 

Share This Article